Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌ను వెంటాడుతున్న హరీష్ రావు భయం : భట్టి విక్రమార్క

Webdunia
శనివారం, 31 జనవరి 2015 (19:44 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ఆయన మేనల్లుడు హరీష్ రావు భయం వెంటాడుతోందని టీ కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క సందేహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ మేల్లుడు హరీష్ రావు భయంతోనే కేసీఆర్ సచివాలయం మారుస్తానంటున్నారన్నారు. 
 
వాస్తు పేరిట ప్రభుత్వ ఆస్తులను ఫణంగా పెట్టడం సరికాదన్నారు. మూఢనమ్మకాలను వదిలి, సైంటిఫికల్‌గా, లాజికల్‌గా ముఖ్యమంత్రి పరిపాలన చేస్తే ప్రజలు కూడా అనుసరిస్తారని ఆయన హితవు పలికారు. సచివాలయాన్ని మార్చాల్సిన అవసరం ఏంటని అయన నిలదీశారు. 
 
సెక్రటేరియట్‌ను మార్చాలంటే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించాలని, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్ర సమస్యలు పరిష్కరించడానికే ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పిన ఆయన, అనవసర పనులు మానేసి సుపరిపాలనపై దృష్టిపెట్టాలని భట్టి విక్రమార్క సలహా ఇచ్చారు. 

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments