Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేటీఆర్ ఓ తుపాకీ రాముడు

Webdunia
బుధవారం, 15 సెప్టెంబరు 2021 (07:04 IST)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు."కేటీఆర్ ఓ తుపాకీ రాముడు.. అతని మాటలు ఎవరు పట్టించుకుంటారు" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. యూపీఏ హయాంలో రాష్ట్రానికి 32 శాతం నిధులిస్తే, ఎన్డీయే వచ్చాక 9 శాతం పెంచి 42 శాతం ఇస్తున్నామని సంజయ్ తెలిపారు.

కేటీఆర్ ఒక అజ్ఞాని, తుపాకీ రాముడు అని అన్నారు. కేటీఆర్‌ను ఎవరు పట్టించుకుంటారని, కేసీఆర్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేసారు.

పన్నుల విషయంలో రాష్ట్రానికి, కేంద్రానికి చట్టం ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రులు పొగిడినట్లు లీకులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. కొత్త సెక్రటేరియట్ పూర్తయ్యే సరికి ఈ ప్రభుత్వం ఉండదని ఆయన జోస్యం చెప్పారు. సచివాలయానికి వెళ్లని వాడికి కొత్తది ఎందుకని ప్రశ్నించారు.
 
ఉద్యోగి చనిపోయిన తర్వాత, పదవీ విరమణ  తర్వాత పీఆర్‌సీ ఇస్తారా, దేశంలో ఎక్కడైనా ఉందా అని ఆయన నిలదీశారు. ముఖ్యమంత్రి దిగజారి మాట్లాడుతున్నాడన్నారు. ఆర్టీసీ విషయంలో ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆలోచించాలన్నారు.

ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కి వెళ్లకుండా ముఖ్యమంత్రి ఎందుకు వాయిదా వేయించాడన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ ప్రణాళిక ఏమిటి, కేంద్ర వ్యవసాయ మంత్రికి ముఖ్యమంత్రి ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని సంజయ్ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

కల్కి 2898 AD నుంచి ప్రభాస్, దిల్జిత్ దోసాంజ్ 'భైరవ అంథమ్' రిలీజ్

షో రీల్ తో ఆకట్టుకున్న మిస్టర్ బచ్చన్

అంజలి బహిష్కరణ చేసింది ఎవరిని?

సినిమా రంగంలో సవాళ్లు నేపథ్యంగా ఇట్లు... మీ సినిమా

అనుపమ పరమేశ్వరన్ నటిసున్న పరదా లో దర్శన రాజేంద్రన్ పరిచయం

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments