గోషా మహల్ నుంచి.. ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి.. రాజా సింగ్‌పై పోటీ...

Webdunia
సోమవారం, 19 నవంబరు 2018 (17:42 IST)
గోషా మహల్ ప్రాంతం నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజా సింగ్ బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున ముఖేష్ గౌడ్ కూడా గోషా మహల్ నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి బీఎల్ఎఫ్ తరపున ఓ ట్రాన్స్‌జెండర్‌కి టికెట్ ఇచ్చింది ఫ్రంట్. ఈ సందర్భంగా సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, సామాజిక మార్పులో భాగంగా హిజ్రాల వర్గానికి చెందిన అభ్యర్థికి టికెట్ ఇచ్చామని.. ఇదే తమ ఘనతని చెప్పారు. 
 
బహుజన లెఫ్ట్ ఫ్రంట్ తరపున కేటాయించిన టికెట్లలో భాగంగా గోషా మహల్ నుంచి తాము పోటీ చేయాల్సి ఉందని అందుకే... తమ అభ్యర్థిగా చంద్రముఖిని ఎన్నుకున్నామని తమ్మినేని తెలిపారు. చంద్రముఖి గతంలో పలు టీవీ షోలు చేయడంతో పాటు వ్యాఖ్యాతగా, యాంకర్‌గా కూడా పనిచేశారు.
 
ఈ సందర్భంగా అభ్యర్థి చంద్రముఖి మాట్లాడుతూ... ట్రాన్స్‌జెండర్లు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారని.. వారిపై దాడులు కూడా జరుగుతున్నాయన్నారు. అందరితో సమానంగా వారికి గౌరవం దక్కాలంటే వారు కూడా రాజకీయాల్లోకి రావాల్సిందేనని.. చట్ట సభల్లో తమ సమస్యల గురించి మాట్లాడాల్సిందేనని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments