Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్త కాళ్లు నరికేసిన కోడలు... ఎందుకు?

ఓ కోడలు తన అత్త కాళ్లు నరికివేసింది. ఈ పని ఎందుకు చేసిందో తెలిసా? కూతురి పేరిట ఇల్లు రిజిస్ట్రేష‌న్ చేసింద‌న్న కోపంతో ఈ దారుణానికి పాల్పడింది. దీంతో బాధితురాలు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొ

Webdunia
సోమవారం, 18 సెప్టెంబరు 2017 (11:09 IST)
ఓ కోడలు తన అత్త కాళ్లు నరికివేసింది. ఈ పని ఎందుకు చేసిందో తెలిసా? కూతురి పేరిట ఇల్లు రిజిస్ట్రేష‌న్ చేసింద‌న్న కోపంతో ఈ దారుణానికి పాల్పడింది. దీంతో బాధితురాలు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా చౌట‌ప్ప‌ల్‌కు చెందిన ముచ్చెర్ల రాములు, మంగ‌మ్మ (60) దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చిన్నకుమార్తె సుజాత వైక‌ల్యంతో బాధ‌ప‌డుతోంది. స్థానికంగా ఉన్న రెండు ఇళ్ల‌లో ఒక ఇంటిని మంగ‌మ్మ ఇటీవ‌ల కుమార్తె సుజాత‌ పేరుపై రిజిస్ట్రేష‌న్ చేసింది. విష‌యం తెలిసిన కోడ‌లు జ‌య‌శ్రీ అత్త‌తో వాగ్వాదానికి దిగింది.
 
ఇదే విషయంపై ఇద్ద‌రి మ‌ధ్య గత కొన్ని రోజులుగా గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఆదివారం కూడా ఇద్ద‌రి మ‌ధ్య మ‌రోమారు గొడ‌వ జ‌రిగింది. ఘ‌ర్ష‌ణ తీవ్ర రూపం దాల్చ‌డంతో ఆగ్ర‌హం ప‌ట్ట‌లేని జ‌య‌శ్రీ అత్త మంగ‌మ్మ‌ను రోక‌లి బండ‌తో మోదింది. అనంతరం ప‌దునైన ఆయుధం తీసుకొచ్చి అత్త రెండు కాళ్ల‌ను న‌రికేసింది. మంగ‌మ్మ ఆర్త‌నాదాలు విన్న స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. 
 
వారు వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ర‌క్త‌పు మ‌డుగు‌లో ఉన్న మంగ‌మ్మ‌ను స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఇంతలో జయశ్రీ అక్కడ నుంచి పారిపోయింది. దీనపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు జ‌య‌శ్రీ కోసం గాలిస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments