తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు నేటితో ముగింపు

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2023 (11:42 IST)
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజైన ఆదివారం ఉభయసభల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతుంది. అలాగే, శాసనసభ ఆమోదించిన బిల్లులు, అంచనా వ్యయంపై మండలిలో చర్చిస్తారు. 
 
ఈ చివరి రోజు సమావేశాల్లో భాగంగా, మండలి ప్రారంభంకాగానే డిప్యూటీ ఛైర్మన్‌ను ఎన్నుకోనున్నారు. డిప్యూటీ ఛైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండా ప్రకాష్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవంకానుంది. ఈయన మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటించిన తర్వాత ఆయనకు బాధ్యతలు అప్పగిస్తారు. 
 
మరోవైపు ఈ నెల ఆరో తేదీన తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ 2023-24ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. శాఖలవారీగా బడ్జెట్ డిమాండ్లు, గ్రాంట్లపై శనివారం అర్థరాత్రి వరకు అసెంబ్లీలో చర్చ కొనసాగింది. దీంతో ఆదివారం శాసనసభలో మంత్రి హరీష్ రావు ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెడతారు.
 
బిల్లుపై సీఎం కేసీఆర్ సమాధానమిస్తారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాల్లో భాగంగా బస్తీ దావఖానాలు, గురుకులాలు, హరితవనాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, సమీకృత వ్యవసాయ మార్కెట్లు, పంట రుణాల మాఫీ, అక్షరాస్యత తదితర అంశాలపై మంత్రులు సమాధానమిస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐటీ ఉద్యోగాలు వదిలి హీరోయిన్లు అయ్యారు

Peddi: ఆరు రోజుల్లో పెద్ది షూటింగ్ పూర్తి - ఐటెంసాంగ్ లో సంయుక్త మీనన్ !

Nagababu: CASTE మూవీ నుంచి రంగరాజన్ గా నాగబాబు లుక్

బెల్లంకొండ గణేష్, ఎ. కరుణాకరన్ కాంబినేషన్ లో రొమాంటిక్ కామెడీ చిత్రం

Vishwak Sen: థాయ్‌లాండ్‌లో విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ ల ఈఎన్ఈ రిపీట్ షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తాజా పిండి: ఆధునిక వంటగదులకు సాంప్రదాయ పిండి రుబ్బే పద్ధతిని తెస్తున్న సాఫ్టెల్

తర్వాతి కథనం
Show comments