Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసదుద్దీన్ బెంగుళూరు వస్తే అరెస్టు చేస్తాం :: పోలీసులు

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (11:11 IST)
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఓవైసీ బెంగుళూరు వస్తే అరెస్టు చేస్తామని బెంగుళూరు సిటీ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు అసదుద్దీన్‌కు పోలీసులు ఓ లేఖను పంపించారు. ఇది సోమవారం వచ్చి చేరింది. 
 
ఇటీవలి కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా చర్చకు తెర తీస్తున్న మజ్లిస్ సోదరులు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలపై నిషేధాజ్ఞలు పలు చోట్ల కొనసాగుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పలు నగరాల్లో వీరి ప్రవేశంపై నిషేధం అమలవుతుండగా, తాజాగా ఆ జాబితాలో బెంగళూరు కూడా చేరిపోయింది. 
 
ఈ నెల 24 నుంచి 28 దాకా అసదుద్దీన్ ఓవైసీ బెంగళూరులో పర్యటించాల్సి ఉంది. అయితే సోమవారం బెంగళూరు పోలీసుల నుంచి అసదుద్దీన్‌కు ఓ నోటీసు అందింది. ‘బెంగళూరులో మీరు ప్రవేశించడానికి వీలు లేదు. అంతేకాక ఆడియో, విజువల్ మీడియా ద్వారా కూడా మీరు ప్రసంగించేందుకు కుదరదు’ అంటూ బెంగళూరు పోలీసులు ఆ నోటీసుల్లో అసదుద్దీన్‌కు తేల్చిచెప్పారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments