అసదుద్దీన్ ఉదార స్వభావం... అలా చేసి పూజారి ప్రాణాలు రక్షించారు..

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (09:00 IST)
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీని పక్కా హిందూ ద్వేషిగా చాలా మంది భావిస్తుంటారు. కానీ, ఆయనలో చాలా ఉదారస్వభావం ఉందని మరోమారు నిరూపించారు. కరోనా వైరస్ బారినపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ హిందూ ఆలయ పూజారికి ఆస్పత్రిలో ఓ పడక ఇప్పించి అందరి మనస్సులను గెలుచుకున్నారు. 
 
తాజా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిసీలిస్తే, హైదరాబాద్ పాతబస్తీలోని ఓ ఆలయం ఉంది. ఇక్కడ 75 ఏళ్ల పూజారి పనిచేస్తున్నారు. ఈయనకు గత శనివారం కరోనా వైరస్ సోకింది. 
 
అప్పటి నుంచి ఆయన ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో గురువారం కొంత అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయనను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించే ప్రయత్నం చేశారు.
 
అయితే, ఎక్కడా బెడ్స్ అందుబాటులో లేకపోవడంతో వారిలో ఆందోళన మరింత పెరిగింది. ఈ క్రమంలో స్థానిక మజ్లిస్ నేత సాయంతో అసదుద్దీన్‌కు పరిస్థితి వివరించారు. ఆ వెంటనే స్పందించిన అసద్ శాలిబండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి పూజారికి బెడ్ ఇప్పించి ఉదారత చాటుకున్నారు. దీంతో బాధిత కుటుంబసభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments