Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైల్డ్ పోర్నోగ్రఫీ సెర్చ్ చేసిన ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

Webdunia
గురువారం, 6 ఆగస్టు 2020 (22:22 IST)
ఇంటర్నెట్లో చైల్డ్ పోర్నోగ్రఫీ సెర్చ్ చేసి ఫోటోలు, వీడియోలను అప్లోడ్ చేసిన ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చైల్డ్ పోర్నోగ్రఫీ నిషేధం ఉన్న సంగతి తెలసిందే.
 
ఇంటర్నెట్లో ఎవరు సెర్చ్ చేసినా ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేసినా వారి వివరాలు అన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోలో  రికార్డ్ అవుతాయి జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు.
 
2020 సంవత్సరంలో ఫోర్న్ సెర్చ్ చేసిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన 15 మంది వివరాలను తెలంగాణ సిఐడి విభాగానికి   ఎన్‌సి‌ఆర్‌బి అధికారులు పంపించారు. ఈ 15 మందిలో హైదరాబాద్‌కి చెందిన ఇద్దరు వ్యక్తుల వివరాలను హైదరాబాద్ పోలీసులకు ఇవ్వగా, మరో 13 మంది వివరాలను ఆయా జిల్లాల పోలీసులకు సీఐడీ అధికారులు పంపించారు.
 
ఇక 2019 సంవత్సరంలో సెర్చ్ చేసిన తార్నాకకు చెందిన మహమ్మద్ ఫెరోజ్, కాచిగూడకి చెందిన ప్రశాంత్ కుమార్ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు సైబర్ క్రైమ్ పోలీసులు. నిషేధిత చైల్డ్ పోర్నోగ్రఫీని ఎవరు సెర్చ్ చేసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments