Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఏర్పడినా ఇంకా ఆంధ్రా పేర్లేనా : కేసీఆర్ ఆగ్రహం!

Webdunia
శుక్రవారం, 19 డిశెంబరు 2014 (12:46 IST)
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటై ఆర్నెల్లు అయినప్పటికీ.. తెలంగాణా నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్ళకు ఇంకా ఆంధ్రా ప్రాంత పేర్లను కొనసాగించడాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా.. రాజధాని హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే ఆంధ్రప్రదేశ్ (ఏపీ) ఎక్స్‌ప్రెస్ రైలు పేరును మార్చకపోవడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 
 
ఆ రైలు పేరును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని ఇప్పటికే టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్రానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. రైల్వే మంత్రి సురేశ్ ప్రభుకు కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ లేఖ కూడా రాశారు. అయినా కేంద్రం స్పందించకపోవడంతో తాజాగా కేసీఆర్ స్వయంగా రైల్వే మంత్రికి గురువారం లేఖ రాశారు.
 
ప్రస్తుతం హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడుస్తున్న రైలును తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌గా పిలుస్తున్న నేపథ్యంలో దాని పేరును కొమురం భీం ఎక్స్‌ప్రెస్‌గా మార్చాలని, ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు తెలంగాణ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి తన లేఖలో కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర ఏర్పాటై ఆరు నెలలు గడుస్తున్నా హైదరాబాద్ - న్యూఢిల్లీ రైలుకు ఏపీ పేరునే కొనసాగించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments