తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ ప్రయాణికులకు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. ఇందులోభాగంగా ఆయన మరో ఆఫర్‌ను ప్రకటించారు. ప్రయాణికులను ఆకట్టుకునేదుకు వివిధ రకాలైన విన్నూత్న పథకాలను చేపడుతున్నారు. ఇందులోభాగంగా, మరో ఆకర్షణీయమైన స్కీన్‌ను ఆయన ప్రవేశపెట్టారు.
ఇందులోభాగంగా, 250 కిలోమీటర్లకు పైగా దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ముందుగా టిక్కెట్ రిజర్వు చేసుకునే ప్రయాణికులు వారి ఇంటి వద్ద నుంచి బోర్డింగ్ పాయింట్ వరకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. జంట నగరాల్లో ప్రయాణానికి ముందు 2 గంటలు, ప్రయాణం తర్వాత 2 గంటల సమయం వరకు ఈ అవకాశం వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు.