Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు తెలంగాణాలో అమిత్ షా పర్యటన - సూర్యాపేటలో బహిరంగ సభ

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (08:52 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తుంది. దీంతో భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు ఆ రాష్ట్రంలో తరచుగా పర్యటిస్తున్నారు. ఇందులోభాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు సూర్యాపేటలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఈ బహిరంగ సభ సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. 
 
ఈ బహిరంగ సభను ముగించుకుని సాయంత్రం 5.45 గంటలకు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళతారు. అదేసమయంలో తెలంగాణ బీజేపీ నేతలతో కూడా ఆయన కీలక సమావేశం నిర్వహిస్తారు. కాగా, నవంబరు 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరుగనున్న విషయం తెల్సిందే. 
 
ఇదిలావుంటే, ఈ పర్యటన కోసం ఆయన గురువారం రాత్రే హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. గురువారం రాత్రి నేషనల్ పోలీస్ అకాడెమీలో బస చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు 75వ బ్యాచ్ పోలీసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్నారు. 
 
లంక చేతిలో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్.. డిఫెండింగ్ చాంపియన్ ఇక ఇంటికేనా?  
 
భారత్‌లో జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా, గురువారం ఇంగ్లండ్, శ్రీలంక జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మరోమారు అత్యంత చెత్త ప్రదర్శనతో చిత్తుగా ఓడిపోయింది. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 33.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ లక్ష్యాన్ని శ్రీలంక జట్టు కేవలం 25.4 ఓవర్లలో రెండు వికెట్లను కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక 77, సదీర సమర విక్రమ 65 చొప్పున పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. నిజానికి శ్రీలంక ఓ దశంలో 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ, నిస్సాంక, సమర విక్రమలు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి జట్టును విజయతీరానికి చేర్చారు. 
 
ఈ ఓటమితో ఇంగ్లండ్ జట్టుకు సెమీస్ ఆశలు మరింత సంక్లిష్టమయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్, ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడి ఒకే మ్యాచ్‌లో మాత్రమే నెగ్గింది. అది కూడా బంగ్లాదేశ్‌పై. న్యూజిలాంజ్, ఆప్ఘనిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక చేతుల్లో ఓటమి పాలైంది. ఇక ఆ జట్టు మరో నాలుగు మ్యాచ్‌లలో ఆడాల్సి వుంది. ఈ నాలుగింటిలో వరుసగా గెలిస్తే ఇంగ్లండ్ సెమీస్‌కు వచ్చే అవకాశాలున్నాయి. 
 
అయితే, ఆ నాలుగు మ్యాచ్ ల్లో  ఇంగ్లండ్ విజయం సాధించడం అంత సులువు కాదు. భారత్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్లతో ఆ జట్టు తలపడాల్సి ఉండటమే ఇందుకు కారణం. ఇంగ్లండ్ తన తర్వాతి మ్యాచ్‌లో భారత జట్టుతో లక్నో వేదికగా తలపడుతుంది. వరుస విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేనపై పైచేయి సాధించాలంటే ఇంగ్లండ్ శక్తికి మించి కృషి చేయాల్సిందే. 
 
మరోవైపు, మొదటి రెండు మ్యాచ్‌లో ఓడిన ఆస్ట్రేలియా.. తర్వాత మూడు మ్యాచ్ నెగ్గి సెమీస్ రేసులో ముందుకొచ్చింది. నెదర్లాండ్స్ కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. సౌతాఫ్రికాను డచ్ జట్టు ఎలా చిత్తుగా ఓడించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాకిస్థాన్ కూడా తనదైన రోజు ఎంత పెద్ద జట్టునైనా ఓడించగలదు. ఈ సవాళ్లను అధిగమించి ఇంగ్లండ్ సెమీస్‌కు వస్తే అది అద్భుతమే అవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Game changer DHOP, చెర్రీ-కియారా ధోప్ సాంగ్ సోషల్ మీడియాలో షేక్ (Video)

"ఎల్లమ్మ"లో కనిపించనున్న సాయిపల్లవి..?

నవీన్ పొలిశెట్టి పెండ్లి కోసం ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్

Charmy Kaur : తెలంగాణ సర్కారుకు కృతజ్ఞతలు తెలిపిన ఛార్మీ కౌర్

పూర్ణ ప్రదాన పాత్రలో ఎమోషనల్ థ్రిల్లర్ డార్క్ నైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments