Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ ఎవరో మాకు తెలీదు... మిషన్ కాకతీయ బ్రాండ్ అంబాసిడర్ అతడు కాదు...

ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ కార్యక్రమానికి ప్రచార కార్యకర్తగా ఎవర్ని నియమించలేదు. వరంగల్ జిల్లాలో మిషన్ కాకతీయ అంబాసిడర్‌గా చెప్పుకొని తిరుగుతున్న అఖిల్ అనే వ్యక్తికి మిషన్ కాకతీయతో ఎలాంటి సంబంధం లేదు. ఇరిగేషన్ శాఖతో

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2016 (11:17 IST)
ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ కార్యక్రమానికి ప్రచార కార్యకర్తగా ఎవర్ని నియమించలేదు. వరంగల్ జిల్లాలో మిషన్ కాకతీయ అంబాసిడర్‌గా చెప్పుకొని తిరుగుతున్న అఖిల్ అనే వ్యక్తికి మిషన్ కాకతీయతో ఎలాంటి సంబంధం లేదు. ఇరిగేషన్ శాఖతో కానీ, మంత్రి హరీష్ రావు కార్యాలయంతో కానీ అతనికి ఎలాంటి సంబంధం లేదు. అఖిల్‌ను కానీ, మరొకరిని కానీ మిషన్ కాకతీయ అంబాసిడర్‌గా నియమించలేదు. 
 
అఖిల్ అనే వ్యక్తి 'అంబాసిడర్'గా చెలామణి అవుతూ కాంట్రాక్టర్లు, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లపై ఒత్తిడి తెస్తూ, బెదిరిస్తు... వాహనాలు సమకూర్చుకుంటున్నట్టు, డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. వరంగల్ జిల్లాలో మిషన్ కాకతీయ కార్యక్రమాలని నిర్వహిస్తున్నానని అందుకు నిధులు సమకూర్చాలని డాక్టర్లను, పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలు, వ్యాపారుల వద్ద నుంచి కూడా నిధులు వసూలు చేస్తున్నట్లు మంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వస్తున్నాయి.
 
అఖిల్‌తో పాటు మరెవరు 'మిషన్ కాకతీయ' పేరు చెప్పుకొని ఫోన్ చేసినా వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి పట్టించండి. ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, వరంగల్ జిల్లా ప్రజలు ఇటువంటి దొంగ మనుషుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి మోసగాళ్ల కదలికలు తెలిసిన వెంటనే కేసు పెట్టి అరెస్టు చేయించాలి.
- శ్రీధర్ రావు దేశ్ పాండే, మంత్రి హరీష్ రావు ఓఎస్డి
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మై విలేజ్ షో కంటెంట్‌న నేను ఫాలో అయ్యేవాడ్ని : ఆనంద్ దేవరకొండ

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్

కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ కేరళ షెడ్యూల్ కంప్లీట్, దీపావళికి రెడీ

Nani: ఆర్ఎఫ్సీలో ది పారడైజ్ కోసం నాని భారీ యాక్షన్ సీక్వెన్స్

నలందా విశ్వవిద్యాలయం బ్యాక్‌గ్రౌండ్‌లో స్ఫూర్తి నింపే గేమ్‌ అఫ్‌ చేంజ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

తర్వాతి కథనం
Show comments