Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లోని ధనుకా గ్రూప్ స్టాల్‌ను సందర్శించిన వ్యవసాయ మంత్రి

Webdunia
శనివారం, 17 జూన్ 2023 (23:28 IST)
గౌరవనీయులైన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ హైదరాబాద్‌లో జరుగుతున్న G20 వ్యవసాయ మంత్రివర్గ సమావేశంలో ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ స్టాల్‌ను సందర్శించారు. వ్యవసాయ రంగానికి గ్రూప్ అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గౌరవనీయులైన  వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి కూడా పాల్గొన్నారు.
 
స్టాల్‌ను సందర్శించిన సందర్భంగా, గౌరవనీయులైన శ్రీ తోమర్, శ్రీ కైలాష్ చౌదరిలు గ్రూప్ చైర్మన్ శ్రీ  ఆర్.జి. అగర్వాల్‌తో వ్యవసాయ రంగంలో వివిధ అవకాశాలు, వ్యవసాయ రసాయన పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి సంభాషించారు. సదస్సు ప్రారంభ రోజున, ధనుకా గ్రూప్ ఏర్పాటు చేసిన స్టాల్‌ను గౌరవనీయులైన వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్లో భాగంగా కంపెనీ తన వినూత్న ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్, డ్రోన్ టెక్నాలజీలు, వ్యవసాయం అనుబంధ రంగాలలో సాధించిన విజయాలను ప్రదర్శించింది.
 
ఈ సందర్భంగా ధనుకా గ్రూప్ చైర్మన్, శ్రీ ఆర్.జి అగర్వాల్ మాట్లాడుతూ, “జి20 అగ్రికల్చర్ మినిస్టీరియల్ మీటింగ్‌లో ధనుకా అగ్రిటెక్ లిమిటెడ్ పాల్గొనడం, వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో ప్రపంచ వాటాదారులతో కలిసి పనిచేయడానికి మా నిబద్ధతను తెలియజేస్తోంది. ధనుకా వద్ద మేము రైతులతో సహా వివిధ వాటాదారులకు మా నైపుణ్యం, వినూత్న పరిష్కారాలను పంచుకోవడం ద్వారా పర్యావరణ అనుకూల వ్యవసాయం, ఆహార భద్రత అభివృద్ధికి తోడ్పడేందుకు కృషి చేస్తున్నాము" అని అన్నారు.
 
జి-20 యొక్క అగ్రికల్చరల్  వర్కింగ్ గ్రూప్(AWG) ఆధ్వర్యంలో వ్యవసాయ మంత్రుల 3 రోజుల సమావేశం గురువారం ప్రారంభమైంది. ఇందులో సభ్య దేశాలు, ఆహ్వానించబడిన దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుండి 200 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: తమన్నా భాటియా, డయానా పెంటీ నటించిన డూ యు వాన్నా పార్టనర్ రాబోతుంది

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

తర్వాతి కథనం
Show comments