Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ బంధానికి భర్త అడ్డొస్తున్నాడని భార్య ఏంచేసిందో తెలుసా..?

ప్రియుడితో వివాహేతర సంబంధానికి కట్టుకున్న భర్త అడ్డొస్తున్నాడని భర్తను చంపిన ఘటన హైదరాబాద్ కలకలం రేపింది. వికారాబాద్‌కు చెందిన ఆనంద్ పది సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. పురానాపూల్‌కు మహేశ్వరిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరిక

Webdunia
గురువారం, 2 ఆగస్టు 2018 (14:37 IST)
ప్రియుడితో వివాహేతర సంబంధానికి కట్టుకున్న భర్త అడ్డొస్తున్నాడని భర్తను చంపిన ఘటన హైదరాబాద్ కలకలం రేపింది. వికారాబాద్‌కు చెందిన ఆనంద్ పది సంవత్సరాల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. పురానాపూల్‌కు మహేశ్వరిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మహేశ్వరి అనారోగ్యానికి గురవ్వడంతో ఆమెను ఆటోలో ఆసుపత్రికి పంపాడు ఆనంద్. ఆటో డ్రైవర్ సంజు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి శివరాంపల్లిలోని ఇంటివద్ద విడిచిపెట్టాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
భర్త ఆనంద్ మద్యానికి బానిస అవ్వడం.. తాగి వచ్చి మహేశ్వరిని కొడుతుండేవాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ప్రియుడితో కలిసి భర్త అడ్డు తొలగించుకోవాలని అనుకుంది మహేశ్వరి. రోజూ మాదిరిగానే ఆనంద్ తాగి వచ్చి పడుకున్నాడు. వెంటనే సంజుకు ఫోన్ చేసి ఇంటికి రావాలని చెప్పింది. ఇద్దరు కలిసి ఆనంద్ మెడకు ప్లాస్టిక్ తాడు బిగించి హత్య చేశారు. శవాన్ని గంధంగూడలోని సంజు భూమి వద్దకు తీసుకెళ్లి తగులబెట్టారు. పూర్తిగా కాలిపోయిన తరువాత ఎముకలను మూసీ నదిలో పడేశాడు. 
 
ఆనంద్ కనిపించకుండాపోయిన విషయం తెలుసుకున్న అతడి సోదరుడు కాశప్ప బలవంతం చేయడంతో రాజేంద్ర నగర్ పోలీసులకు మహేశ్వరి ఫిర్యాదు చేసింది. అనంతరం పది రోజుల తరువాత మహేశ్వరిపై కాశప్పకు అనుమానం రావడంతో పోలీసులకు విషయం చెప్పాడు. తనకు తన వదిన మహేశ్వరి మీదే అనుమానం ఉందని తెలపడంతో పోలీసులు మహేశ్వరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించింది. ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments