Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో విచ్చలవిడిగా డ్రగ్స్? నటుడు శివాజీ చెప్పిందే నిజమా?

విదేశాల సరిహద్దులు దాటి ఎక్కడో ఆఫ్రికా, అమెరికాలోని షికాగో నుంచి డ్రగ్స్ వస్తుంటే కస్టమ్స్ వ్యవస్థ ఏం చేస్తున్నట్లు...? అంటూ నటుడు శివాజీ విమర్శించారు. డ్రగ్స్ సరఫరాకు ఇండియన్ పోస్టల్‌ను, కొరియర్ సర్వ

Webdunia
శనివారం, 22 జులై 2017 (21:28 IST)
విదేశాల సరిహద్దులు దాటి ఎక్కడో ఆఫ్రికా, అమెరికాలోని షికాగో నుంచి డ్రగ్స్ వస్తుంటే కస్టమ్స్ వ్యవస్థ ఏం చేస్తున్నట్లు...? అంటూ నటుడు శివాజీ విమర్శించారు. డ్రగ్స్ సరఫరాకు ఇండియన్ పోస్టల్‌ను, కొరియర్ సర్వీసులను వాడుకుంటూ వుంటే కస్టమ్స్ అధికారులు ఏం చేస్తున్నారండీ.. కస్టమ్స్ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. డ్రగ్స్ వ్యవహారంలో సినిమా వారిని విచారిస్తున్న తీరు కాస్త ఇబ్బంది పెట్టేదిగా వుందంటూ చెప్పుకొచ్చారు.
 
మీడియాకు అనుమతి లేదని చెప్పండి. వాళ్లు ఇంటి దగ్గర నుంచి కాలు బయట పెట్టిన దగ్గర్నుంచి సిట్ ఆఫీసుకు వచ్చేవరకూ కెమేరాలు ఫోకస్ పెట్టి ఏంటండీ ఇంత అన్యాయం. వారు నేరం చేశారని రుజువు కాకపోయినా ఇలా వారి పట్ల మీడియాలో ప్రచారం కావడం దారుణమన్నారు. అందుకే మీడియాకు అనుమతి లేకుండా విచారణ జరపాలన్నారు. 
 
డ్రగ్స్ వ్యవహారంలో విచారించాలనుకున్నవారిని నాలుగు గదుల మధ్య వీడియోలను పెట్టి రికార్డ్ చేసి విచారణ చేసుకోమని సలహా ఇచ్చారు. అంతేకానీ.. ఇంటి దగ్గర నుంచి ఆఫీసు వరకూ కెమేరాలు పెట్టి నానా హంగామా చేస్తుంటే వాళ్ల కుటుంబ సభ్యులు, పిల్లలు అల్లాడిపోరా అని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
మరోవైపు డ్రగ్స్ విషయంలో ఎక్సైజ్ శాఖ పట్ల వర్మ మాట్లాడింది కరెక్టు కాదంటూ ఖండించారు. మనకున్న అభ్యంతరాలను వారికి చెప్పుకోవచ్చు కానీ వ్యతిరేకంగా మాట్లాడటం విచారణ ఎదుర్కొనేవారికి మంచిది కాదని అన్నారు. ఇదిలావుంటే హైదరాబాదులో టాస్క్ ఫోర్స్ చేసిన దాడుల్లో గంజాయి, మత్తు మందు బయటపడుతూనే వున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments