టిఆర్ఎస్ అధికార ప్రతినిధిగా ప్రకాష్‌ రాజ్... సీఎం కేసీఆర్ అలా చెప్పేశారా?

సినీ తారలు రాజకీయాల్లోకి క్యూ కడుతున్నారు. కొంతమంది నటులు రాజకీయాల్లో ముందుకు వెళుతుంటే మరికొంతమంది నటులు వెనక్కి వెళ్ళిపోతున్నారు. తాజాగా నటుడు ప్రకాష్‌ రాజ్ టిఆర్ఎస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్థం చేసుకున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, మోడీపై తీ

Webdunia
సోమవారం, 2 ఏప్రియల్ 2018 (19:04 IST)
సినీ తారలు రాజకీయాల్లోకి క్యూ కడుతున్నారు. కొంతమంది నటులు రాజకీయాల్లో ముందుకు వెళుతుంటే మరికొంతమంది నటులు వెనక్కి వెళ్ళిపోతున్నారు. తాజాగా నటుడు ప్రకాష్‌ రాజ్ టిఆర్ఎస్‌ పార్టీలో చేరేందుకు రంగం సిద్థం చేసుకున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, మోడీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తున్న ప్రకాష్ రాజ్ తనకు అనువైన పార్టీ కోసం ఎదురుచూశారు. 
 
తెలంగాణా రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి ఆదరణ ఉండడం, దాంతో పాటు అభివృద్థి కార్యక్రమాల్లో తెలంగాణా రాష్ట్రం దూసుకు వెళుతుండటంతో ప్రకాష్‌ రాజ్ ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్థం చేసుకున్నారు. ఇప్పటికే కెసిఆర్‌ను కలిసిన ప్రకాష్‌ రాజ్ ఆ పార్టీలో చేరాలన్న నిర్ణయానికి వచ్చేశారు. 
 
నటుడిగా ప్రజల్లో ఆదరణ ఉన్న ప్రకాష్‌ రాజ్‌ను టిఆర్ఎస్ లోకి తీసుకునేందుకు కెసిఆర్ కూడా సుముఖుత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రకాష్‌ రాజ్‌కు టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పజెప్పాలన్న నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణా రాష్ట్రంలో మరింత బలం చేకూరే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments