Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఒక రొమాంటిక్ క్రైమ్'' సినిమా చూసి ఇన్‌స్పైర్ అయ్యారు.. అభయ్ కిడ్నాప్ కూడా?!

''ఒక రొమాంటిక్ క్రైమ్'' సినిమాను చూసి.. అభయ్ కిడ్నాప్ కూడా అలాగే?

Webdunia
ఆదివారం, 20 మార్చి 2016 (17:47 IST)
హైదరాబాదులో సంచలనం సృష్టించిన పదో తరగతి విద్యార్థి అభయ్ హత్య కేసులో సీపీ మహేందర్ రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు. నిందితులు చిన్నసాయి, రవి, మోహన్‌లు ఈ నెల 14వ తేదీన 'ఒక రొమాంటిక్ క్రైమ్' సినిమాను చూసి, దానిని ఫాలో అయి చంపేసినట్లుగా తేలిందని వివరించారు. సినిమాను చూసి అభయ్‌ని చంపేసిన నిందితులు.. సినిమా నటులుగా స్థిరపడేందుకు ఈ దురాగతానికి పాల్పడినట్లు సీపీ మహేందర్ తెలిపారు.  
 
ఒక రొమాంటిక్ క్రైమ్ సినిమాలో చైన్ స్నాచింగులు, కిడ్నాప్ చేయడం వంటి అంశాలతో వారు ఇన్‌స్పైర్ అయ్యారని చెప్పారు. వారికి సినిమా ఫీల్డులో రాణించాలనే కోరిక ఉంది. దీంతో ఆ సినిమాను చూసి, దానిని ఫాలో అయి, కిడ్నాప్ ద్వారా డబ్బులు సంపాదించి, సినిమా ఫీల్డులో నటులుగా ఎదగాలని భావించారని చెప్పారు. 
 
ఈ నెల 16వ తేదీన అభయ్ కిడ్నాప్, హత్య జరిగిందని.. అమాయకుడిని చంపడం దారుణమన్నారు. ముగ్గురు కలిసి అభయ్‌ని కిడ్నాప్ చేశారని చెప్పారు. నిందితులు చిన్నసాయి అలియాస్ శేషు, రవి, మోహన్‌లు అని వెల్లడించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని, రిమాండుకు తరలిస్తామని చెప్పారు. డబ్బుకోసమే అభయ్‌ని చంపినట్లు నిర్ధారణ అయినట్లు చెప్పారు. నిందితులంతా 22 ఏళ్లవారేనని చెప్పారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments