Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ డీఆర్డీవోకు కలాం పేరు పెట్టాలి : కేంద్రానికి కేసీఆర్ లేఖ

Webdunia
ఆదివారం, 2 ఆగస్టు 2015 (16:05 IST)
గతనెలలో హఠాన్మరణం చెందిన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు స్మారకంగా హైదరాబాద్‌లోని రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు కలాం పేరు పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆదివారం లేఖ రాశారు.
 
హైదరాబాద్‌తో పాటు డీఆర్డీవోకు అబ్దుల్ కలాంకు ప్రత్యకమైన అనుబంధముందని, పైగా దేశ రక్షణ రంగ అభివృద్దికి కలాం ఎంతో కృషి చేశారని, అందువల్ల ఆయన జ్ఞాపకార్థంగా డీఆర్డీవోకు కలాం పేరు పెట్టడమే సముచితంగా భావిస్తున్నట్టు కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. డీఆర్డీవోకు డైరక్టర్‌గా అబ్దుల్ కలాం పని చేసిన విషయంతెల్సిందే. 
 
కాగా, అబ్దుల్ కలాం జూలై 27వ తేదీన షిల్లాంగ్ ఐఐఎంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగిస్తూ హఠాత్తుగా కుప్పకూలి తుదిశ్వాసను కోల్పోయిన విషయంతెల్సిందే. ఆయనకు నివాళులు అర్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరూ వెళ్లలేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో డీఆర్డీవోకు కలాం పేరు పెట్టాలని కేసీఆర్ లేఖ రాయడం గమనార్హం.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments