Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లోని సుచిత్ర వద్ద తమ నూతన క్లాస్‌రూమ్‌ కేంద్రం ప్రారంభించిన ఆకా‌ష్‌ బైజూస్‌

Webdunia
శుక్రవారం, 26 మే 2023 (15:41 IST)
దేశంలో టెస్ట్‌ ప్రిపరేటరీ సేవలలో అగ్రగామి సంస్థ ఆకాష్‌ బైజూస్‌ నేడు తమ నూతన క్లాస్‌రూమ్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లోని సుచిత్ర వద్ద  ప్రారంభించింది. నగరంలో ఎనిమిదివ తరగతి నుంచి నీట్‌, జెఈఈ, ఐఐటీ, ఒలింపియాడ్‌ కోచింగ్‌ మరియు ఫౌండేషన్‌ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు ఈ కేంద్రం ప్రారంభించారు. ఈ నూతనకేంద్రంతో దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నెట్‌వర్క్‌ కేంద్రాల సంఖ్య 330కు చేరింది.
 
భారీ 18,775 చదరపు అడుగుల విస్తీర్ణంలో సర్వే నెంబర్‌ 85, రెండవ అంతస్తు, జైన్‌ఫ్రెండ్స్‌ స్క్వేర్‌, సుచిత్ర అకాడమీ పక్కన, సుచిత్ర ఎక్స్‌ రోడ్స్‌, హైదరాబాద్‌ వద్ద ఉన్న ఈ నూతన కేంద్రంలో 21 తరగతి గదులు ఉంటాయి. ఇవి 1500 మంది విద్యార్థులకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు తగిన సౌకార్యలను అందించగలవు. అంతేకాకుండా హైబ్రిడ్‌ తరగతులను నిర్వహించే సదుపాయాలూ ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్‌ నగరంలో ఆకాష్‌ బైజూస్‌కు ఇది తొమ్మిదవ కేంద్రం. మిగిలిన కేంద్రాలు హిమాయత్‌నగర్‌, కొత్తపేట, ఎస్‌ఆర్‌ నగర్‌, షేక్‌పేట, కొండాపూర్‌, కూకట్‌పల్లి, హబ్సిగూడా, తిరుమలగిరి వద్ద ఉన్నాయి.
 
ఆకాష్‌ బైజూస్‌ రీజనల్‌ డైరెక్టర్‌ శ్రీ ధీరజ్‌ కుమార్‌ మిశ్రా, కంపెనీ ఉన్నతాధికారుల సమక్షంలో ఈ క్లాస్‌రూమ్‌ సెంటర్‌ను ప్రారంభించారు. నూతన కేంద్రం ప్రారంభం గురించి ఆకాష్‌ బైజూస్‌ సీఈఓ అభిషేక్‌ మహేశ్వరి మాట్లాడుతూ, ‘‘విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని విద్యనందించడాన్ని మేము నమ్ముతుంటాము. కోర్సు కంటెంట్‌ పరంగా మాత్రమే కాదు, ఆన్‌లైన్‌ మరియు ఆఫ్‌లైన్‌ విధానాలలో సమతుల్యత పాటించడం ద్వారా వైవిధ్యత చాటుతున్నాము’’ అని అన్నారు.
 
ఆకాష్‌ బైజూస్‌ రీజనల్‌ డైరెక్టర్‌ శ్రీ ధీరజ్‌ కుమార్‌ మిశ్రా మాట్లాడుతూ, ‘‘హైదరాబాద్‌లో మా తొమ్మిదవ క్లాస్‌రూమ్‌ కేంద్రం ప్రారంభించడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము. ఈ క్లాస్‌రూమ్‌ కేంద్రం, నీట్‌, జెఈఈ మరియు ఒలింపియాడ్స్‌ మొదలైన వాటిలో పాల్గొనే వారికి సహాయపడే కోర్సులను అందించనుంది.  మా సెంటర్లలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు, మెంటార్లు, కౌన్సిలర్లు ఉన్నారు’’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments