కొమురం భీమ్ జిల్లాలో పెద్ద పులి దాడికి యువకుడు మృతి

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (20:24 IST)
కొన్ని గ్రామాలు అటవీ ప్రాంతాలు చేరువలో ఉండటం వల్ల అప్పడప్పుడు క్రూర మృగాల దాడికి గురవుతుంటారు అక్కడి ప్రజలు. ముఖ్యంగా పులులు జానాసంలోకి వస్తూ ఆవులపై, సాధు జంతువులపై, మనుషులపై తన పంజాను విసురుతుంటాయి. అలాంటి  ఘటనే ఇక్కడ ఓ యువకుడి ప్రాణాలను బలితీసింది.
 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. కొమురం భీమ్ జిల్లాలో పెద్ద పులి దాడి కలకలం రేపింది. దహేగాం రాంపూర్ అటవీ ప్రాంతంలో ఓ పెద్దపులి దాడి చేయడంతో 20 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. యువకుడిని చంపిన పులి అతడి మృతదేహాన్ని అడవిలోకి లాక్కెళ్లింది.
 
సమాచారం అందుకున్న అటవీ, పోలీసు శాఖ అధికారులు, ఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పరిశీలించారు. పెద్దపులి దాడికి ఒక్కసారిగా రాంపూర్ గ్రామం ఉలిక్కిపడింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న భయంతో వణుకుతున్నారు గ్రామస్తులు. అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుని పెద్దపులిని బంధించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments