Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారసుడు కావాలి : మగపిల్లాడు పుట్టలేదని ట్రిపుల్ తలాక్

Webdunia
మంగళవారం, 19 నవంబరు 2019 (21:25 IST)
ట్రిపుల్ తలాక్ చట్టం వచ్చినా.. ముస్లిం మహిళలకు కష్టాలు తీరటంలేదు. అర్థంపర్థం లేని కారణాలను సాకుగా చెప్పి.. ట్రిపుల్ తలాక్ అనే మూడు మాటలు చెప్పి భార్యల్ని వదిలించుకుంటున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో కొడుకుని కని ఇవ్వలేదని ఓ వ్యక్తి తన భార్యకు విడాకులు ఇచ్చాడు. దీంతో బాధిత మహిళ మెహ్‌రాజ్ బేగం.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొడుకుకి జన్మనివ్వలేదని.. తన భర్త తనకు ట్రిపుల్ తలాక్ చెప్పాడని వాపోయింది. 
 
ఇప్పటికే మరో యువతితో సంబంధం ఉన్న తన భర్త కొడుకుని కని ఇవ్వలేదనీ.. తన వంశానికి వారసుడు కావాలని నువ్వు ఆ పని చేయలేదు కాబట్టి నువ్వు నాకు అక్కరలేదని చెప్పి ట్రిపుల్ తలాక్ అని చెప్పి వదిలించుకోవటానికి యత్నిస్తున్నాడనీ, తను మరో పెళ్లి చేసుకుంటున్నాడని వాపోయింది. తనకు న్యాయం చేయమని కోరుకుంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అతన్ని శిక్షించి తనకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తోంది. మెహ్‌రాజ్ బేగం ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.
 
అర్థంపర్థం లేని కారణాలతో భార్యల్ని ట్రిపుల్ తలాక్ పేరుతో వదిలించుకుని మరో పెళ్లికి సిద్దపడుతున్నారు కొందరు. కొన్ని రోజుల క్రితం తన భార్య పళ్లు ఎత్తుగా ఉన్నాయనే సాకుతో ఓ భర్త తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన ఘటన హైదరాబాద్‌లో జరిగింది. బిర్యానీ చేయలేదనీ ఓ భర్త.. కూర బాగా వండలేదనీ మరొకరు.. ఇలా చిన్న చిన్న కారణాలు చెప్పి భార్యల్ని వదిలించుకుంటున్న సందర్భాలు ఎన్నో. ట్రిపుల్ తలాక్ చట్టం వచ్చినా.. ముస్లిం మహిళలు దీనికి బలైపోతూనే ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments