Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్: మ్యాన్ హోల్‌లో పడి చిన్నారి మృతి

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2023 (10:50 IST)
child
హైదరాబాదులో భారీ వర్షాల కారణంగా మ్యాన్ హోల్స్ పొంగిపొర్లుతున్నాయి. సికింద్రాబాద్‌లోని కళాసిగూడలో తెరచి వుంచిన మ్యాన్ హోల్‌లో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పాలప్యాకెట్ కోసం వెళ్లిన చిన్నారి మౌనిక డ్రైనేజీలో పడి కొట్టుకుపోయింది. పార్క్ లైన్ వద్ద మౌనిక మృతదేహాన్ని డీఆర్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. 
 
చిన్నారి మరణానికి జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. శనివారం భారీ వర్షాలతో రోడ్లు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు వరదతో నిండిపోయాయి. మ్యాన్ హోల్స్ నుంచి నీరు పొంగిపొర్లుతోంది. కళాసీగూడలో ఓ మ్యాన్ హోల్ తెరిచి ఉంచడంతో ప్రమాదం జరిగింది. 
 
చిన్నారి కోసం గాలించగా.. పార్క్ లైన్ వద్ద పాప మృతదేహం బయటపడింది. పాల ప్యాకెట్ కోసం వెళ్లిన పాప ఇలా మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

chiru: చిరంజీవి విశ్వంభర నుంచి ఫస్ట్ సింగిల్ రామ రామ సాంగ్ పోస్టర్ రిలీజ్

Jack review: సిద్ధు జొన్నలగడ్డ జాక్ చిత్రం ఎలావుందంటే.. జాక్ రివ్యూ

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

తర్వాతి కథనం
Show comments