Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముక్కుపచ్చలారని బాలుడు... పచ్చటి లాన్‌లో ఆడుకుంటూ అనంతలోకాలకు...

Webdunia
బుధవారం, 13 ఫిబ్రవరి 2019 (11:02 IST)
హైదరాబాద్ నగరంలో విద్యుదాఘాతానికి గురైన బాలుడు మృతి చెందిన సంఘటన దిగ్భ్రాంతి కలిగిస్తోంది. వివరాలలోకి వెళ్తే చెన్నైకి చెందిన దివాకర్ భార్యాపిల్లలతో కలిసి పీరంచెరువులోని ఫెబల్ సిటీలో ఈ-బ్లాక్ 8వ నంబర్ ఫ్లాట్‌లో నివాసముంటున్నాడు. ఇతను స్థానికంగా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. అతని ఏడేళ్ల కుమారుడు మోనీష్ ప్రైవేట్ పాఠశాలలో 1వ తరగతి చదువుకుంటున్నాడు. 
 
ప్రతి రోజూ స్కూల్ అయిపోగానే అపార్ట్‌మెంట్స్ లాన్‌లో తోటి పిల్లలతో ఆడుకునేవాడు. సోమవారం కూడా ఆడుకుంటూ అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాన్ని పట్టుకుని అలాగే ఉండిపోయాడు. అప్పటికే స్తంభం కింది భాగంలో కట్ అయిన వైర్ నుండి విద్యుత్ సరఫరా అవుతోంది. పిల్లలు, పెద్దవారు అంతగా గమనించలేదు, ఒక నిమిషం తర్వాత కింద పడిపోవడంతో వెంటనే హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
 
దీంతో అపార్ట్‌మెంట్ వాసులు బాధ్యులైనవారిపై చర్య తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. మోనీష్ తండ్రి కూడా పోస్టుమార్టానికి తొలుత అంగీకరించలేదు. ఆ తర్వాత దోషులకు శిక్ష పడేలా చేస్తామని హామీ ఇవ్వడంతో అంగీకరించారు. నిర్లక్ష్యం ఖరీదు ఒక నిండు ప్రాణం. అపార్ట్‌మెంట్‌ల కల్చర్ పెరుగుతున్న నేపథ్యంలో కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదని ఇప్పటికే ఎన్నో ఘటనలు నిరూపించినా, పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాకపోవడం బాధాకరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments