Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బు ఇస్తానని పిలిచి మత్తు మందు కలిపి అత్యాచారం చేశాడు

Webdunia
గురువారం, 14 మే 2020 (22:22 IST)
ఓవైపు కరోనా.. మరోవైపు లాక్‌డౌన్‌ సమయంలో హైదరాబాద్‌లో ఓ దారుణం వెలుగు చూసింది. ఓ 70 ఏళ్ల వృద్ధుడు.. ఆయనకు నలుగురు భార్యలు.. అయినా అమ్మాయిలు అంటే పిచ్చి. ఆర్థిక సాయం చేస్తానంటూ నమ్మించి ఇంటికి పిలిపించి మత్తుమందు ఇచ్చి ఆపై అత్యాచారానికి పాల్పడిన ఘటన బయటపడింది. 
 
దీంతో బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో నివాసం ఉంటున్న 70 ఏళ్ల మొహమ్మద్ సలీమ్ ఉద్దీన్‌ అనే వ్యక్తిపై అత్యాచారం కేసు నమోదు చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. సలీమ్‌కు నలగురు భార్యలు. వారంతా విదేశాల్లో ఉంటారు.. సలీమ్ కూడా విదేశాల్లోనే ఉండి అమ్మాయిల కోసం తరచూ హైదరాబాద్‌కు వస్తూ ఉంటాడు. నిరుపేద అమ్మాయిలకు ఆర్థిక సహాయం చేస్తానంటూ నమ్మించి ఇంటికి పిలిపించుకుని వారిపై అఘాయిత్యానికి పాల్పడతాడు. 
 
తాజాగా 23 ఏళ్ల యువతిపై కన్నేసిన సలీమ్‌.. ఆర్థిక సహాయం పేరుతో ఇంటికి పిలిపించుకున్నాడు. అనంతరం ఆ యువతికి మత్తుమంది ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన బాలిక.. పూర్తి ఆధారాలతో హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించింది. 
 
భరోసాలో విచారణ అనంతరం ఆ యువతి కేసును బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. దీంతో, యువతి ఇచ్చిన ఫిర్యాదుపై సలీమ్ ఉద్దీన్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు.. ఆర్థిక సహాయం చేస్తానంటూ పలువురు అమ్మాయిలపై సలీమ్ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: కాశీలో సాధువును కలిసిన రేణు దేశాయ్.. విశ్వాసం మేలు చేస్తుంది.. (video)

విజయ్ సేతుపతి రిలీజ్ చేసిన యాక్షన్ మూవీ కోర టీజర్

రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌ లోని సాంగ్ కు డాన్స్ చేసిన గౌతమ్ వాసుదేవ మీనన్

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర టెక్నికల్ టీమ్ మార్పు !

ఇన్ని కండోమ్‌లైతే కన్యలు దొరకడం కష్టమే, ఐతే మేకలు, కుక్కలతో శృంగారం కోసం కొనండి: చిన్మయి ఘాటు రిప్లై

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Women Teachers Day: సావిత్రీబాయి ఫూలే జయంతి- మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments