Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో దారుణమైన ఘటన, నిద్రిస్తున్న మహిళను ఎత్తుకెళ్ళి గ్యాంగ్ రేప్

Webdunia
సోమవారం, 27 జనవరి 2020 (18:21 IST)
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న మహిళను ఎత్తుకెళ్లి ఆమెపై ఏడుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రఘునాథపాలెం మండలానికి చెందిన 35 ఏళ్ల వివాహిత ఇంట్లో నిద్రపోతోంది. నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇద్దరు యువకులు గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించారు. ఆమె కేకలు వేయకుండా నోరు గట్టిగా అదిమిపెట్టి ఆమెను బలవంతంగా తీసుకుని వెళ్లారు. 
 
మధ్యలో వారితో మరికొందరు యువకులు కలిశారు. ఆమెను అదే మండలంలోని హర్యాతండాలోని పత్తి చేనులోకి తీసుకుని వెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. పక్కింటి వ్యక్తి సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే వారు పరారయ్యారు. 
 
తనపై హర్యాతండాకు చెందిన మోహన్, ఉపేందర్, కల్యాణ్, చంటి, అజ్మీరా నాగేశ్వర రావు, సుకినీ తండాకు చెందిన అశోక్, సునీల్ అత్యాచారానికి పాల్పడినట్లు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారం జరిగిన స్థలాన్ని పోలీుసులు పరిశీలించారు. నిందితులు అదే ప్రాంతంలో మద్యం తాగినట్లు పోలీసులు గుర్తించారు. 
 
నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితురాలి గ్రామానికి చెందినవారు, బంధువులు రఘునాథపాలెం పోలీస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంటెస్ట్ ద్వారా డ్రింకర్ సాయి 31న మంచి పార్టీ ఇస్తాడు

నింద చిత్రానికి అంతర్జాతీయ స్ట్రీమింగ్ కి ఆమోదం

మ్యాడ్ స్క్వేర్ చిత్రం నుండి స్వాతి రెడ్డి.. గీతం విడుదల

అమెరికా, ఆస్ట్రేలియా లో కూడా రిలీజ్ కాబోతున్న పా.. పా.. మూవీ

ట్రెండింగ్‌లో సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీ ఫన్నీ వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

తర్వాతి కథనం