Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో పోలీసుల కొరఢా : 353 మంది మందుబాబులకు జైలుశిక్ష

Webdunia
బుధవారం, 28 జులై 2021 (16:04 IST)
మందు బాబులపై హైదరాబాద్ పోలీసులు కొరఢా ఝుళిపిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన మందుబాబులకు చుక్కలు చూపిస్తున్నారు. 

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను విస్తృతంగా నిర్వహిస్తూ వాహనాలు నడిపేవారిపై కేసులు నమోదు చేశారు. తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్‎లో పట్టుబడ్డ 353 మందికి జైల్ శిక్ష పడింది. డ్రండ్ అండ్ డ్రైవ్ కేసులను విచారణ జరిపిన కోర్టు.. ఇటీవల 353 మందికి ఒక రోజు నుంచి 20 రోజుల వరకు జైలు శిక్షను ఖరారు చేస్తున్నట్లు వెల్లడించింది.

కాగా, భాగ్యనగరంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే, కూకట్‎పల్లిలో 79, మియాపూర్ 60, మాదాపూర్ 41, బాలానగర్ 49, రాజేంద్రనగర్ 30, శంషాబాద్ 24, గచ్చిబౌలిలో 50 మంది మందు బాబులకు జైలు శిక్ష పడింది. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్‎కు ఆర్‎టీవో అధికారులకు పోలీసులు లేఖను పంపారు.

సంబంధిత వార్తలు

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments