Webdunia - Bharat's app for daily news and videos

Install App

30 ఏళ్ల వయస్సులోనే ఆమెపై 12 కేసులు.. రూ.58.75 లక్షలు మోసం

సెల్వి
బుధవారం, 16 అక్టోబరు 2024 (23:01 IST)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో 12 కేసుల్లో ఉద్యోగ అవకాశాల పేరిట మోసం చేసిన 30 ఏళ్ల మహిళను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కాగ్నిజెంట్, ఐబీఎం వంటి బహుళ-జాతీయ సంస్థలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని అనేక మంది వ్యక్తులను మోసం చేసింది.
 
రేష్మా అనే నిందితురాలు, తన మాజీ భర్త మహమ్మద్ అలీ, మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి నకిలీ సిమ్ కార్డులను కొనుగోలు చేసి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) రంగంలో ఉద్యోగం కోసం సంప్రదించే వ్యక్తులను మోసం చేశారు.  
 
ఈ క్రమంలో హైదరాబాద్‌లోని మియాపూర్‌లో నివసిస్తున్న 34 ఏళ్ల ఎంబీఏ గ్రాడ్యుయేట్ వనజను కాగ్నిజెంట్‌లో సీనియర్ హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్‌ఆర్) మేనేజర్‌గా నటిస్తూ రేష్మా మోసం చేసింది. ఆ సమయంలో తన ముగ్గురు స్నేహితులు ఉద్యోగాల కోసం వెతుకుతున్నారని వనజ పేర్కొన్న తర్వాత, రేష్మ ఆమెను సుప్రీతి అనే మరో కాగ్నిజెంట్ ఉద్యోగి వద్దకు రెఫర్ చేసింది. 
 
అయితే మొత్తం డ్రామా సక్సెస్ అయ్యాక వనజలా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి వద్ద  మొత్తం రూ.58.75 లక్షలు మోసం చేసింది. ఇలా లక్షల రూపాయలను మోసం చేసిన ఈ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి., భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 66D కింద, సెక్షన్ 420, 467 (ఫోర్జరీ), 468 (మోసం కోసం ఫోర్జరీ) కేసుల కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

కింగ్‌డమ్ విషయంలో పెద్ద ఛాలెంజ్ పరీక్షలో పాస్ అయ్యాము: సూర్యదేవర నాగ వంశీ

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments