తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి చదువుతున్న బాలిక కాలి నడకన పాఠశాలకు వెళుతూ మార్గమధ్యంలో గుండెపోటుతో మరణించింది. రామారెడ్డి మండలం సింగరాయిపల్లికి చెందిన శ్రీనిధి (14) కామారెడ్డిలోని కల్కినగర్‌లో తన పెదనాన్ని ఇంట్లో ఉంటా ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
నిన్న ఉదయం పాఠశాలకు బయలుదేరిన శ్రీనిధి స్కూల్ సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే స్పందించిన పాఠశాల యాజమాన్యం బాలికను ఆస్పత్రికి తరలించింది. వైద్యుల సీపీఆర్ చేసినా ఫలితం లేకపోవడంతో మరో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే శ్రీనిధి ప్రాణాలు కోల్పోయి వైద్యులు నిర్ధారించారు.
మేల్లుడుతో సంబంధం పెట్టుకుంది... అడ్డొస్తున్నాడని భర్తను చంపేసింది..
ఓ మహిళ వయసులో తనకంటే చిన్నవాడైన మేనల్లుడుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న భర్త మందలించాడు. అంతే, మేనల్లుడు ద్వారా పొందే పడకసుఖాన్ని వదులుకోలేని ఆ మహిళ.. భర్త హత్యకు ప్లాన్ చేసింది. ఆ తర్వాత మేనల్లుడు, అతని స్నేహితుడుతో కలిసి పక్కా ప్లాన్ వేసి హత్య చేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్‌షహర్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఈ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తనకంటే చిన్నవాడైన మేనల్లుడు నిమిష్‌తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఎంతోకాలంగా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తూ వచ్చిన ఈ సంబంధం ఓ రోజున భర్తకు తెలిసింది. అంతే, ఆయన భార్యను మందలించాడు. పాడు పనిని మానుకోవాలని హితవు పలికాడు. అయితే ఆ వివాహిత మాత్రం వయసులో తనకంటే చిన్నవాడైన మేనల్లుడు ఇచ్చే పడక సుఖాన్ని వదులుకోలేకపోయింది. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది.
ఈ విషయాన్ని తన మేనల్లుడుకి చెప్పింది. అతను తన స్నేహితుడు తరుణ్‌తో కలిసి వివాహిత భర్త గౌరవ్‌ను హత్య చేశాడు. ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ, అది బెడిసికొట్టింది. శవపరీక్షలో గౌరవ్‌ను గొంతునులిమి హత్య చేసినట్టు తేలింది.
అయితే, తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు వివాహిత ఫిర్యాదు చేశారు. ఈ హత్య గత నెల 24వ తేదీన జరిగింది. దర్యాప్తులో భాగంగా, పోలీసులు గౌరవ్ భార్య మొబైల్ ఫోన్ డేటాను విశ్లేషించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, తన భర్తను మేనల్లుడు నిమిష్, అతని స్నేహితుడు తరుణ్‌లతో కలిసి హత్య చేసినట్టు అంగీకరించింది.