Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రాంక్ మోజులో స్త్రీ వేషం.. పిల్లల కిడ్నాపర్ అనుకుని పట్టుకుని చితకబాదారు...

ఠాగూర్
బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (17:28 IST)
ఫ్రాంక్ మోజులో పడి అనేక మంది యువత తమ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఫ్రాంక్ మోజులో పడిన పంచాయతీ కార్యదర్శి మహిళ వేషం వేశారు. అతన్ని పిల్లలను కిడ్నాప్ చేసే కిడ్నాపర్‌గా భావించిన గ్రామస్థలు పట్టుకుని చితకబాదారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుమ్మలపల్లికి చెందిన బి.వేణుగోపాల్ అనే వ్యక్తి పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నాడు. ఈయనకు ఫ్రాంక్‌ల పిచ్చి. ఈ క్రమంలో గత రాత్రి ములుగు చేరుకుని అమ్మాయిలా వేషం వేసుకుని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద వచ్చీపోయే వారిపై ఫ్రాంక్‌లు చేసేందుకు ప్రయత్నించాడు. 
 
మహిళ వేషంలో ఉన్నది పురుషుడని గ్రహించిన కొందరు వ్యక్తులు వేణుగోపాల్‌ను పట్టుకుని పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠాకు చెందిన వ్యక్తిగా భావించి చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు  వెంటనే అక్కడికి చేరుకుని వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకుని, ఠాణాకు తరలించారు. అక్కడ అతడిని విచారించగా అసలు విషయం వెల్లడైంది. 
 
గుమ్మలపల్లికి చెందిన వేణుగోపాల్‌గా గుర్తించారు. ఫ్రాంక్‌లు చేయడం తనకు అలవాటని చెప్పారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇలాంటి పిచ్చి పని ఏంటని పోలీసులు మందలించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మరోమారు ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments