28 నుంచి తెలంగాణాలో ఇంటర్ పరీక్షలు - నిమిషం ఆలస్యమైనా...

వరుణ్
సోమవారం, 26 ఫిబ్రవరి 2024 (15:29 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 28వ తేదీ బుధవారం నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షల వివరాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి సోమవారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 1521 సెంటర్లను ఈ పరీక్ష కోసం ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 75 ఫ్లయింగ్ స్క్వాడ్, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్, 27,900 మంది ఇన్విజిలేటర్లు ఈ పరీక్షల నిర్వహణ విధుల్లో పాల్గొంటారని తెలిపారు. ఇంటర్ ఫస్ట్, ద్వితీయ సంవత్సర పరీక్షలకు మొత్తం 980978 మంది విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు. 
 
ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుందన్నారు. ఈ పరీక్షకు వచ్చే విద్యార్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా హాల్‌లోకి అనుమతించబోమని చెప్పారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను కోరినట్టు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులు మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకునిరాకూడదని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో నీరు, వైద్య, సదుపాయాలు ఉంటాయని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments