Webdunia - Bharat's app for daily news and videos

Install App

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన ట్రాన్స్ జెండర్లు (video)

సెల్వి
సోమవారం, 9 డిశెంబరు 2024 (14:30 IST)
Transgender
కాంగ్రెస్ ప్రజా పాలన విజయోత్సవాల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ట్రాన్స్ జెండర్ల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంతో గౌరవం ఉందన్నారు. వారిని అన్ని రంగాల్లో ప్రోత్సాహిస్తామని, సమాజంలో గౌరవనీయమైన జీవితాన్ని కల్పిస్తామని తెలిపారు. 
 
ట్రాఫిక్ నియంత్రణలో 54 మంది ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగాలు ఇచ్చామని, దేశంలో ఇంతవరకు ఎవరూ సాహసించని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ట్రాన్స్ జెండర్ల సమస్యలను ప్రతీ ప్రభుత్వం మానవీయ కోణంలో చూడాలన్నారు. ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమిస్తున్నామని.. వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లను ఇస్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.
 
ఇకపై ట్రాన్స్‌జెండర్ల ఆర్థికస్థితి మెరుగు పరిచేందుకు మరిన్ని పథకాలు తీసుకు వస్తామని తెలియజేశారు. అలాగే ట్రాన్స్ జెండర్ల కోసం భారీ సంఖ్యలో "మైత్రి ట్రాన్స్ క్లినిక్స్" ప్రారంభించామని చెప్పారు. 
 
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పటానికి ట్రాన్స్ జెండర్లు పాలాభిషేకం చేశారు. తమను గుర్తించి ట్రాఫిక్ వాలంటీర్లుగా విధుల్లోకి తీసుకోవడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. సమాజంలో వివక్షకు గురవుతున్న తమను కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవిస్తుందని వారు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments