మాజీ సీఎం కేసీఆర్‌పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు!!

ఠాగూర్
ఆదివారం, 7 ఏప్రియల్ 2024 (11:19 IST)
భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనీ, అందువల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడు బి.నిరంజన్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని అందులో పేర్కొన్నారు. 
 
శనివారం సిరిసిల్లలో ఎండిన పంటలను పరిశీలించిన తర్వాత కేసీఆర్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో కాంగ్రెస్ నేతలను ఆయన పరుష పదజాలంతో దూషించారు. ఈ సందర్భంగా వాడిన భాష ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపారు. ఈ ఫిర్యాదును సమర్థిస్తూ వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలకు సంబంధించిన క్లిప్పింగులను లేఖకు జోడించారు. 

కనిగిరిలో చెట్ల నరికివేతను  అడ్డుకున్న స్థానికులు... సీఎం జగన్‌ వస్తే.. ఏంటి గొప్ప?
 
ఎక్కడైనా ప్రముఖులు పర్యటిస్తే గుర్తుగా మొక్కలు నాటతారు. కానీ, వైకాపా అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ వస్తున్నారంటే మాత్రం అక్కడ నీడనిచ్చే పచ్చని చెట్లను నరికివేయడం ఆనవాయితీగా మారింది. ప్రకాశం జిల్లా కనిగిరిలోనూ అదే తీరు పునరావృతమైంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా కనిగిరిలో ఆదివారం సీఎం జగన్‌ రోడ్‌షో నిర్వహించనున్నారు. బస్సు యాత్రకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, రోడ్డుకు ఇరువైపులా నీడనిచ్చే పచ్చని వేప, చింత చెట్లను శనివారం నరికివేశారు. కొన్నేళ్లుగా ఉన్న ఈ పచ్చని చెట్లను నరికివేయడాన్ని స్థానికులు జీర్ణించుకోలేక పోయారు. 
 
ముఖ్యంగా, కనిగిరిపట్టణంలోని చింతలపాలెం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కార్ల స్టాండ్‌ ప్రాంతాల్లో చెట్ల నరికివేత, హోర్డింగ్‌లను తొలగిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. సీఎం జగన్‌ వస్తే ఏంటి గొప్ప? ఎన్నో ఏళ్ల నుంచి నీడనిస్తున్న వృక్షాలను తొలగించడం ఏంటని మున్సిపల్‌, సచివాలయ సిబ్బంది, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీఎం వస్తే చెట్లు నరికేస్తారా.. ఇదెక్కడి తీరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికే సిబ్బంది ఐదు చెట్లను నరికివేశారు. 
 
మరో 20 చెట్ల కొమ్మలను తొలగించారు. ఎక్కువ మంది చేరి నిలదీయడంతో సిబ్బంది వెనుదిరిగి వెళ్లిపోయారు. రాష్ట్రాన్ని పాలించిన ఏ ఒక్క ముఖ్యమంత్రి పర్యటన సమయంలో ఇలాంటి దారుణాలు జరగలేదని స్థానికులు వాపోతున్నారు. ఒక గంట, అరగంట పర్యటన కోసం కొన్ని సంవత్సరాల నుంచి నీడ నిస్తున్న పచ్చని చెట్లను నరికివేయడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments