నర్సు సిబ్బంది నియామకం.. 30 నుంచి సర్టిఫికేట్ల వెరిఫికేషన్

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2023 (13:37 IST)
నర్సు సిబ్బంది నియామకం కోసం ఈ నెల 30 నుంచి వచ్చే నెల 6 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) తెలిపింది. హైదరాబాద్ బండ్లగూడలోని ఎక్సైజ్ అకాడమీ ఆవరణలో ఈ వెరిఫికేషన్ కొనసాగుతుందని వెల్లడించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ 1:1.25 పద్ధతిలో జరుగుతుందని స్పష్టం చేశారు.
 
ఈ మేరకు తాత్కాలిక జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు సమాచారం కూడా అందించారు. అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకాకున్నా లేదా అవసరమైన పత్రాలు సమర్పించకున్నా వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేసింది. 
 
రాష్ట్రవ్యాప్తంగా 5,204 స్టాఫర్స్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతేడాది డిసెంబర్‌ 30న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దా మోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ప్రభుత్వం మరో 1,890 పోస్టులను చేర్చింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 7,094కి చేరింది. ఈ నెల 18న ఫలితాలు విడుదలయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments