Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణాలో పలు జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్!!

ఠాగూర్
మంగళవారం, 13 మే 2025 (17:30 IST)
ఉత్తర దక్షిణ ద్రోణితో పాటు ఉపరితల చక్రవాక ఆవర్తనాల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. క్యుములోనింబస్ మేఘాల కారణంగా పగటిపూట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండగా, సాయంత్రం వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. 
 
రానున్న నాలుగు రోజుల పాటు తెలంగాణాలోని ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు స్పష్టం చేశారు. ముఖ్యంగా, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ఆయా ప్రాంతాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపారు. 
 
ఇదిలావుండగా, నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం నాటికి ఈ రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, అలాగే, దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. రుతుపవనాలు కదలిక ప్రభావంతో గత రెండు రోజులుగా నికోబార్ దీవులు సముహంలో భారీ వర్షపాతం నమోదువుతోందని వాతావరణ విభాగం తెలియజేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments