రూ.2వేల వరద సాయాన్ని కేంద్రం వెంటనే ప్రకటించాలి.. రేవంత్ రెడ్డి

సెల్వి
సోమవారం, 2 సెప్టెంబరు 2024 (22:33 IST)
Revanth Reddy
తెలంగాణ రాష్ట్రానికి వరద సాయంగా రూ.2000 కోట్లు తక్షణ సాయంగా అందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం కేంద్రాన్ని అభ్యర్థించారు. భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో రూ.5 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనాకు వచ్చిన ఆయన, తక్షణం సాయం అందించాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. నిధులు వచ్చేలా కేంద్రమంత్రులు జి. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కుమార్‌లు కృషి చేయాలని కోరారు. 
 
సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటించారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన ఆయన ముందుగా సూర్యాపేట జిల్లాలో వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాలను పరిశీలించారు.  
 
సూర్యాపేట జిల్లాలో అత్యధికంగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అధికారులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్నారని, పంట, ఇతర నష్టాలపై అధికారులు తనకు ప్రాథమిక నివేదిక ఇచ్చారని తెలిపారు. 
 
ఖమ్మం, నల్గొండ జిల్లాల పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి వివరించి, వారి మద్దతు కోరినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి ఎకరం భూమిలో పంటనష్టం వాటిల్లితే రూ.10వేలు పరిహారం చెల్లిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments