Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సిఫార్సు లేఖలకు ఏపీ ఆమోదం.. గురువుకు శిష్యుడు కృతజ్ఞతలు

ఠాగూర్
మంగళవారం, 31 డిశెంబరు 2024 (10:37 IST)
తిరుమల శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుుడు లేఖ రాశారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యుత్తరం రాశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు, టీటీడీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ సీఎంవో ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. 
 
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల విజ్ఞాపన లేఖలను అనుమతించడానికి ఆదేశాలిచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.
 
తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఆ లేఖపై స్పందించిన చంద్రబాబు... టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడితో మాట్లాడి చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తమ నిర్ణయాన్ని నేడు తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేశారు. 
 
ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ నుంచి ప్రతివారం ఏదైనా రెండు రోజుల్లో (సోమవారం నుంచి గురువారం వరకు) వీఐపీ బ్రేక్ దర్శనం (రూ.500/- టికెట్) కొరకు రెండు లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శన్ (రూ.300/- టికెట్) కొరకు రెండు లేఖలు స్వీకరించబడతాయని పేర్కొన్నారు. ప్రతి లేఖతో ఆరుగురు భక్తుల వరకు దర్శనానికి సిఫార్సు చేయొచ్చని చంద్రబాబు తెలంగాణ సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో రామ్ చరణ్

SreeLeela: ఏ చెడును పోస్ట్ చేయవద్దు.. సెలెబ్రిటీల మద్దతు (video)

దిలీప్ శంకర్ ఇక లేరు.. హోటల్ గది నుంచి దుర్వాసన రావడంతో..?

పూరీ జగన్నాథ్ New Resolution 2025, సోషల్ మీడియా దెయ్యంను వదిలేయండి

Pushpa 2: 23 ఏళ్ల ఖుషీ రికార్డును బ్రేక్ చేసిన పుష్ప 2.. టిక్కెట్ల తేడా వుందిగా..!?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

తర్వాతి కథనం
Show comments