Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రతి శుక్రవారం ప్రజా భవన్‌లో ప్రజా దర్బార్ : సీఎం రేవంత్ రెడ్డి

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (15:12 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ఆయన ముఖ్యమంత్రి హోదాలో తొలి ప్రసంగం చేశారు. తెలంగాణ ప్రజలకు ఇవాళే స్వేచ్ఛ వచ్చిందని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. 
 
'ప్రజా ప్రభుత్వం ఏర్పాటుతో ఇక అంతటా సమానాభివృద్ధి సాధ్యం. తెలంగాణ ఆషామాషీగా ఏర్పడిన రాష్ట్రం కాదు. పోరాటాలతో త్యాగాలే పునాదులుగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. పదేళ్లుగా నిరంకుశత్వాన్ని తెలంగాణ ప్రజలు మౌనంగా భరించారు. ఇప్పటికే ప్రగతిభవన్‌ ముందు ఉన్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించాం. సంక్షేమం, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చుదిద్దుతాం. 
 
ఇకపై ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్‌ నిర్వహిస్తాం. మీ బిడ్డగా.. మీ సోదరుడిగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా. మేం పాలకులం కాదు.. మీ సేవకులం. కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తుపెట్టుకుంటా. పదేళ్లుగా కష్టపడిన కార్యకర్తలను గుండెల్లో పెట్టి చూసుకుంటా. విద్యార్థి, నిరుద్యోగ, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తా' అని సీఎం రేవంత్‌ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments