భారాస ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ వాయిదా!

ఠాగూర్
శుక్రవారం, 24 మే 2024 (14:55 IST)
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉంటున్న భారత రాష్ట్ర  సమితి ఎమ్మెల్సీ కె.కవితకు మరోమారు చుక్కెదురైంది. ఈ లిక్కర్ కేసులో బెయిల్ కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో మరోమారు విచారణకు వచ్చింది. బెయిల్‌పై మే 27న కౌంటర్ దాఖలు చేస్తామని సీబీఐ తెలిపింది. జూన్ 7వ తేదీ ఛార్జిషీట్‌ దాఖలు చేయనున్నట్లు కోర్టుకు వెల్లడించింది. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్‌పై ఈడీ కౌంటర్ దాఖలు చేసింది. ఈ కేసులో వాదనలు వినిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
 
కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈడీ అరెస్టు చేసిన విధానం, కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కోర్టుకు కవిత తరఫు న్యాయవాది వివరించారు. ఆదివారం సాయంత్రం లోపు కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ ద్వారా ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సోమవారం రెండు కేసుల్లో కవిత తరపు వాదనలు పూర్తి చేయాలని సూచించింది. మంగళవారం ఈడీ, సీబీఐ వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments