Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో పర్యటించనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

సెల్వి
గురువారం, 18 ఏప్రియల్ 2024 (13:52 IST)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలో పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌లో భాగంగా ఆయన అలెప్పి, వాయనాడ్‌లలో పర్యటిస్తారు. కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణాది రాష్ట్రానికి సీఎంగా, పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రేవంత్ రెడ్డికి వాయనాడ్ నుంచి పోటీ చేయనున్న రాహుల్ గాంధీ సహా అభ్యర్థులకు మద్దతుగా ప్రచార బాధ్యతలు అప్పగించారు. 
 
కేరళ నుంచి తిరిగి వచ్చిన ఆయన ఏప్రిల్ 19న మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.  దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తరపున ప్రచారం నిర్వహించేందుకు ఇప్పుడు.. సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. 
 
ఎన్నికల ప్రచారానికి రావాలని ఇప్పటికే 7 రాష్ట్రాల పీసీసీల నుంచి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఇందులో ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళతో పాటు తమిళనాడు, బీహార్, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి.
 
మరోవైపు ఏప్రిల్ 19 నుంచి వచ్చే నెల 11 వరకు తెలంగాణలో సీఎం రేవంత్ సుడిగాలి పర్యటన చేయనున్నారు రేవంత్. దీంతో.. మొత్తంగా రేవంత్ రెడ్డి 50 బహిరంగ సభలతో పాటు 15 రోడ్ షోలలో పాల్గొననున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐశ్వర్యారాయ్ బచ్చన్ బాడీగార్డు నెల వేతనం తెలుసా?

అమ్మతోడు.. జీవీ ప్రకాష్‌తో డేటింగ్ చేయడం లేదు : దివ్యభారతి

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments