Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ అడిగింది.. బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు... గుడ్డు బొమ్మను నెత్తిన పెట్టుకున్న సీఎం రేవంత్!!

ఠాగూర్
బుధవారం, 1 మే 2024 (15:00 IST)
తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. అధికార కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం సాగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చి తమ ప్రభుత్వంపై చేసిన విమర్శలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీటుగా సమాధానాలు ఇస్తున్నారు. ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్రం అడిగింది ఏంటి.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది ఏంటి అనే అంశాలను ఆయన ఏకరవు పెట్టారు. పదేళ్ళుగా ప్రధానిగా ఉన్న నరంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది శూన్యమన్నారు. ఎన్నో అడిగితే మోడీ ప్రభుత్వం మాత్రం ఇచ్చింది గాడిద గుడ్డు అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసారు. పైగా, మంగళవారం గాడిద గుడ్డు బొమ్మను నెత్తిన పెట్టుకున్న ఫోటోను ఆయన అటాచ్ చేశారు. 
 
తెలంగాణ అడిగింది... పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా : బీజేపీ ఇచ్చింది... గాడిద గుడ్డు 
తెలంగాణ అడిగింది... రైల్వే కోచ్ ఫ్యాక్టరీ : బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు 
తెలంగాణ అడిగింది... బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ : బీజేపీ ఇ్చచింది గాడిద గుడ్డు 
తెలంగాణ అడిగింది... కృష్ణా, గోదావరి జలాల్ల వాటాల పంపకం : బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు 
తెలంగాణ అడిగింది... మేడారం జాతరకు జాతీయ హోదా : బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు 
తెలంగాణ అడిగింది... తెలంగాణ అభివృద్ధి.. దీనికి బీజేపీ అడ్డుకాగా, తెలంగాణకు ఇచ్చింది పెద్ద గాడిద గుడ్డు అంటూ ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments