Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ నిద్రమత్తు.. మహిళ సజీవ దహనం

సెల్వి
శనివారం, 13 జనవరి 2024 (09:17 IST)
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మహిళ సజీవ దహనం అయ్యింది. తీవ్రంగా గాయపడిన మరో నలుగురు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తేల్చారు. మృతురాలిని గుర్తించాల్సి ఉంది.
 
హైదరాబాద్ నుంచి చిత్తూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు గత అర్థరాత్రి దాటిన తర్వాత జిల్లాలోని ఎర్రవల్లి సమీపంలో అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తాపడింది. ఆ వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి.
 
ప్రమాదం జరిగిన వెంటనే బస్సులో ప్రయాణికులు ప్రాణభయంతో హాహాకారాలు చేశారు. అప్పటికే మంటలు చుట్టుముట్టేయడంతో మృతి చెందింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. 
 
అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments