Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొలానికి వెళ్లి పురుగుల మందు తాగిన రైతు... రైతు ప్రాణాలు కాపాడిన పోలీస్... ఎలా?

వరుణ్
గురువారం, 29 ఫిబ్రవరి 2024 (13:26 IST)
ఇంట్లో గొడవపడి పొలానికి వెళ్లి పురుగుల మందు తాగిన ఓ రైతు ప్రాణాలను పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ రక్షించాడు. ఆత్మహత్యకు ప్రయత్నించిన రైతును తన భుజాలపై వేసుకుని రెండు కిలోమీటర్ల దూరంలో గ్రామానికి తీసుకెళ్లి, అక్కడ నుంచి సమీపంలోని ఆస్పత్రిలో చేర్చి, ప్రాణాలు రక్షించాడు. ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా వీణవంక మండలం, భేతిగల్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
జిల్లాలోని వీణవంక మండలం భేతిగల్‌కు చెందిన రైతు సురేశ్ బుధవారం ఇంట్లో గొడవపడి కోపంతో పొలానికి వెల్లాడు. అక్కడ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ జయపాల్, హోంగార్డు కిన్నెర సంపత్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 
 
అప్పటికే అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయిన సురేశ్‌ను జయపాల్ తన భుజాన వేసుకుని పొలం గట్లపై దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో పరుగెత్తుకుంటూ వెళ్లి గ్రామంలోని ఆస్పత్రిలో చేర్చాడు. అక్కడ నుంచి వాహనంపై జమ్మిగుంట ఆస్పత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. రైతును తన భుజాలపై మోస్తూ సకాలంలో ఆస్పత్రికి తీసుకొచ్చిన కానిస్టేబుల్ జయపాల్‌ను గ్రామస్థులతో పాటు వైద్యులు, సహచర పోలీసులు కూడా అభినందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిక లేకుండా వుండలేను.. కార్తీ నువ్వు కార్తీ కాదు.. కత్తివిరా!: సూర్య (video)

తెలుగోళ్లు అన్నం పెడుతున్నారు.. తప్పుగా మాట్లాడలేదు : నటి కస్తూరి

పిల్లల సమక్షంలో రెండో పెళ్లి చేసుకున్న సన్నీ లియోన్.. వరుడు ఎవరంటే? (photos)

6 నుంచి "పుష్ప" కోసం శ్రీలీల - అల్లు అర్జున్ ఐటమ్ సాంగ్ చిత్రీకరణ?

అమెరికాలో మృతి చెందిన మిథున్ చక్రవర్తి తొలి భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

వెల్లుల్లి చట్నీ ఎందుకు తినాలో తెలుసా?

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments