Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతులకు సాయం చేసిన పోలీసులు.. వరిపంట తడిసిపోకుండా..?

సెల్వి
మంగళవారం, 14 మే 2024 (16:47 IST)
Police
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నెల్లికొండ వ్యవసాయ మార్కెట్‌లో లోక్ సభ ఎన్నికల కోసం ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. అక్కడ కేంద్ర, రాష్ట్ర స్థాయి, స్థానిక పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. 
 
అయితే పక్కనే ఉన్న వ్యవసాయ మార్కెట్‌లో రైతులు వరి ధాన్యాన్ని నిల్వ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం మొదలైంది. దీంతో వరిపంట తడిసిపోకుండా రైతులు నానా అవస్థలు పడుతున్నారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు రైతుల కష్టాలను గమనించారు. 
 
పోలీసులు వెంటనే వారి వద్దకు వెళ్లి ధాన్యం తడిసిపోకుండా రైతులకు సహకరించారు. పోలీసుల మానవత్వాన్ని అక్కడి ప్రజలంతా మెచ్చుకున్నారు. అనంతరం రైతులు పోలీసులకు చేతులు జోడించి నమస్కరించారు. ఈ ఘటనను అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన వారంతా సెల్యూట్ పోలీస్ అంటూ సోషల్ మీడియాలో పోలీసుల సహాయాన్ని కొనియాడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో 555 Cr+ వసూళ్లు

భారతీయుడు2 లో క్యాలెండర్ సాంగ్ చేస్తున్న మోడల్ డెమి-లీ టెబో

కల్కి మొదటి వారాంతం హిందీ, ఉత్తర అమెరికా కలెక్టన్ల వివరాలు

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

తీవ్ర జ్వరంతో ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments