Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో కేసీఆర్ - వీల్ ఛైర్‌లో పోచారం.. బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన

Webdunia
శుక్రవారం, 8 డిశెంబరు 2023 (15:00 IST)
బాన్సువాడ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్‌ బీఆర్‌ఎస్‌ నేత, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి వీల్‌ చైర్‌లో కనిపించడం సంచలనంగా మారింది. డిసెంబర్ 8వ తేదీ ఉదయం మాజీ సీఎం కేసీఆర్‌ను చూసేందుకు యశోద ఆస్పత్రికి వచ్చిన పోచారం.. వీల్ చైర్‌తో ఆస్పత్రి లోపలికి వెళ్లారు. దీన్ని చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 
 
పోచారం శ్రీనివాస రెడ్డి కారు దిగి నడవలేని స్థితిలో ఉన్నాడు. అతని సహాయకులు అతన్ని అత్యవసర వార్డు ద్వారా ఆసుపత్రికి తరలించారు. పోచారం శ్రీనివాస రెడ్డికి 74 ఏళ్లు. గత అసెంబ్లీలో స్పీకర్‌గా పనిచేశారు. ఇప్పుడు కూడా బాన్సువాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన డిసెంబర్ 9వ తేదీ శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది.
 
ఇలాంటి సమయంలో పోచారం శ్రీనివాస రెడ్డి.. వీల్‌చైర్‌లో.. ఆస్పత్రికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆయన కేసీఆర్‌ను పరామర్శించేందుకు వచ్చారా లేక చికిత్స కోసం వచ్చారా అనేది తెలియాల్సి ఉంది. కేసీఆర్ ఆస్పత్రిలో.. పోచారం వీల్ చైర్‌లో కనిపించడం బీఆర్‌ఎస్ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments