Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేవంత్ రెడ్డికి అభినందనలు.. రాష్ట్ర అభివృద్ధికి సాయం.. ప్రధాని

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (22:20 IST)
తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం అన్ని విధాలా సాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. 
 
సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో పీఎం మోదీ ట్విట్టర్ వేదికగా సందేశం ఇచ్చారు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని తాను హామీ ఇస్తున్నానని తెలిపారు. 
 
ఎన్నికల సమయంలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. కేంద్రం తరపున రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తానంటూ ట్వీట్ చేయడం ద్వారా ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
 
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష పార్టీ నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులకు ఆహ్వానాలు పంపారు. అయితే వీరు ప్రమాణ స్వీకారానికి హజరు కాలేదు కానీ, ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments