Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సింగ్ విద్యార్థి మృతి కేసు : ఎమ్మెల్యేకు చుక్కలు చూపించిన విద్యార్థులు... ఎక్కడ?

ఠాగూర్
శుక్రవారం, 24 మే 2024 (16:36 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో కారుణ్య అనే నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. గురువారం ఉదయం ఆమె అపస్మారకస్థితిలోకి జారుకుంది. కాలేజీ ప్రాంగణంలో ఆమె గాయాలతో పడివున్నారు. దీంతో యాజమాన్యం ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుది శ్వాస విడిచింది. దీంతో ఈ రోజు ఆమె బంధువులు, విద్యార్థులు ర్యాలీగా వచ్చి కళాశాల వద్ద నిరసన తెలిపారు. కారుణ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 
 
ఇంతలో అక్కడకు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాలేజీకి వచ్చి యాజమాన్యంతో మాట్లాడారు. ఎమ్మెల్యే రాకతో కారుణ్య బంధువులు, విద్యార్థి సంఘాలు ఆయనను నిలదీశాయి. నిందితుల తరపున మాట్లాడేందుకు ఇక్కడకు వచ్చారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కారుణ్య బంధువులకు నచ్చజెప్పేందుకు ఎమ్మెల్యే ఎంతగానో ప్రయత్నించారు. కానీ, వారు వినకపోవడంతో ఇక చేసేదేం లేక అక్కడ నుంచి ఎమ్మెల్యేగారు జారుకున్నారు. 
 
వామ్మో అంత రేటా : రూ.లక్షల్లో పలుకుతున్న ఇండో-పాక్ టీ20 వరల్డ్ కప్ టిక్కెట్ ధర!! 
 
మరికొన్ని రోజుల్లో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ పోటీలు ప్రారంభంకానున్నాయి. అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ జట్లు మరోమారు క్రికెట్ మైదానంలో ప్రత్యక్షంగా తలపడనున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఇండో పాక్ మ్యాచ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. 
 
ఈ రెండు జట్ల మధ్య జూన్ 9వ తేదీన న్యూయార్క్‌లోని నన్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. అందులో డైమండ్ క్లాస్ సీట్లకు టికెట్ ధరను 20 వేల డాలర్లుగా నిర్ణయించారని ప్రచారం జరుగుతోంది. అంటే సుమారు రూ.16.6 లక్షలు అన్నమాట. దీనిపై ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ తీవ్రంగా మండిపడ్డారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని తప్పుపడుతూ ఓ ట్వీట్ చేశారు. 
 
'భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ కోసం డైమండ్ క్లబ్ కేటగిరీ ఒక్కో సీటుకు 20 వేల డాలర్ల రేటు పెట్టడం చూసి షాక్ అయ్యాను. అమెరికాలో టీ20 ప్రపంచకప్‌ను నిర్వహిస్తున్నదే.. ఆటను మరింత విస్తరించడం, అభిమానులను అలరించడం కోసం. అంతే తప్ప అడ్డగోలు టికెట్ చార్జీలు పెట్టి లాభాలు ఆర్జించడం కోసం కాదు. మామూలు టికెట్ కోసం కూడా 2,750 డాలర్లు (సుమారు రూ.2.29 లక్షలు) ధర పెట్టడం దారుణం. ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కాదు.. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ క్రూక్స్ (మోసగాళ్ల కౌన్సిల్)' అని లలిత్ మోడీ విరుచుకుపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments