బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి నీతా అంబానీ రూ.కోటి విరాళం

ఠాగూర్
శుక్రవారం, 20 జూన్ 2025 (08:35 IST)
రిలయన్స్ అధినేత ముుఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ మరోమారు పెద్ద మనసు చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి ఆమె కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ ఆలయాన్ని ఈ యేడాది ఏప్రిల్ 23వ తేదీన ఆలయాన్ని తన తల్లితో ఆమె స్పందించారు. ఆ సమయంలో దేవస్థానం అభివృద్ధికి సహకరించాలని ఆలయ ఈవో కోరిక మేరకు ఆమె విరాళం ఇచ్చారు. 
 
హైదరాబాద్ నగరంలోని ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానానికి నీతా అంబానీ కోటి రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు. ఈ విరాళం బుధవారం నాడు దేవస్థానం బ్యాంక్ ఖాతాలో జమ అయింది. ఈ ఏడాది ఏప్రిల్ 23న నీతా అంబానీ తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతా దలాల్ బల్కంపేట ఆలయాన్ని సందర్శించారు. 
 
ఆ సమయంలో వారు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సందర్భంగా అప్పటి ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) కృష్ణ వారికి ఆలయ ప్రాముఖ్యతను, విశిష్టతను వివరించారు. దేవస్థానం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించాలని ఆయన వారిని కోరారు.
 
ఆలయ యాజమాన్యం చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన నీతా అంబానీ, ఇప్పుడు రూ.కోటి విరాళాన్ని అందించారు. ఈ విరాళం మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, దానిపై వచ్చే వడ్డీతో ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆలయ ప్రస్తుత ఇన్ఛార్జి ఈఓ మహేందర్ గౌడ్ తెలిపారు. భక్తులకు నిరంతరాయంగా అన్నదానం చేసేందుకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

Karti : అన్నగారు నే రిచ్ కిడ్డు, రాజమౌళికి ఫోన్ చేసి బయోపిక్ తీయమంటున్న.. కార్తి పై సాంగ్

Dil Raju: పుకార్ల పై నిర్మాత దిల్ రాజు అధికారిక ప్రకటన

Samantha: సమంత- రాజ్ వివాహం.. శామ్ చేతిలో మెరిసిన డైమండ్ రింగ్ గురించి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments