జూబ్లీహిల్స్ ఉప పోరు : కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు

ఠాగూర్
బుధవారం, 8 అక్టోబరు 2025 (23:14 IST)
సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మృతితో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల 11వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి పేరును ఏఐసీసీ ఖరారు చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసినట్టు ఏఐసీసీ అధికారిక ప్రటనను విడుదల చేసింది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు నేతలు పోటీ పడినప్పటికీ అదృష్టం మాత్రం నవీన్ యాదవ్ పేరును ఏఐసీసీ ఎంపిక చేసింది. 
 
తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్టీ యువ నాయకుడు, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, సీఎన్ రెడ్డి పేర్లను అధిష్టానికి పంపించారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేరును కూడా పరిశీలించినప్పటికీ ఆయన పోటీలో లేనని మంగళవారం స్పష్టం చేశారు. 
 
ఈ నేపథ్యంలో అధిష్టానం వారి పేర్లను పరిశీలించి నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన విషయం తెల్సిందే. నవంబరు 11వ తేదీన పోలింగ్ జరుగనుండగా, 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్లి చేశారు ... హనీమూన్ ఎక్కడో చెప్పండి : నటి త్రిష

Sarath Kumar: అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు: శరత్ కుమార్

Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్‌ లోగ్ ఫస్ట్ లుక్

Vishwak Sen: వినోదాల విందుకి హామీ ఇచ్చేలా విశ్వక్ సేన్.. ఫంకీ టీజర్

Shivaji : ప్రేమకు నమస్కారం లో మహాదేవ నాయుడుగా శివాజి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంల మంచితనంతో దీపాల పండుగను జరుపుకోండి

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

తర్వాతి కథనం
Show comments