Webdunia - Bharat's app for daily news and videos

Install App

Monsoon: నైరుతి రుతుపవనాలు - అంతకుముందే అల్పపీడనం.. తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్

సెల్వి
బుధవారం, 21 మే 2025 (09:31 IST)
నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే వేగంగా ముందుకు సాగుతున్నాయి. జూన్ మొదటి వారం నాటికి రాష్ట్రాన్ని తాకవచ్చు. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను ప్రభావం అంతకంటే ముందుగా రుతుపవనాలను రాష్ట్రాలను తాకేలా చేస్తున్నాయి. 
 
మే 22 నాటికి కర్ణాటక తీరంలో అల్పపీడన ప్రాంతంగా పరిణామం చెంది మరింత తీవ్రమవుతుందని ఐఎండీ  అధికారులు తెలిపారు. రుతుపవనాలు అధికారికంగా రాష్ట్రంలోకి ప్రవేశించే ముందే తెలంగాణలో దాని ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. మిగతా చోట్ల, తెలంగాణలో రాబోయే రెండు, మూడు రోజుల్లో, ముఖ్యంగా ఉత్తర, మధ్య జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలుంటాయి. 
 
ఇందులో భాగంగా తెలంగాణలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ విధించింది. "నైరుతి రుతుపవనాలు రాబోయే 4-5 రోజుల్లో కేరళకు చేరుకోవడానికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇది 2010 తర్వాత ఇది తొలి ప్రారంభం కావచ్చు" అని ఐఎండీ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. 
 
కేరళలో రుతుపవనాల సాధారణ ప్రారంభ తేదీ జూన్ 1. అయితే మే 27కి ముందు రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 
 
తెలంగాణలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఎల్లో అలర్ట్ విధించారు. 
 
ముఖ్యంగా రైతులు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ సూచించింది. బంగాళాఖాతం, మయన్మార్ తీరప్రాంతంలో కదలికను బట్టి, కేరళకు ముందే ఈశాన్యంలో రుతుపవనాలు వర్షాలు పడే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments