Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‌స్టాఖాతాలో మైనర్ బాలికలకు గాలం ... ఆపై వ్యభిచారం.. ఎక్కడ (Video)

ఠాగూర్
మంగళవారం, 18 మార్చి 2025 (14:38 IST)
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌లో సెక్స్ రాకెట్‌ గుట్టురట్టు అయింది. మైనర్ బాలికలను వ్యభిచార రొంపిలోకి దింపుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి లత అనే మహిళతో సహా మొత్తం ఆరుగురుని అరెస్టు చేశారు. మైనర్‌లతో వ్యభిచారం చేయిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడిన ఓ మహిళ ఈ పాడుపనికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ముఠాలోని ఓ యువతి ఇన్‌స్టాఖాతా ద్వారా మైనర్ బాలికలను ట్రాప్ చేసి, ఆపై మైనర్లకు మద్యం, గంజాయి అలవాటు చేసి వారిని నర్సంపేటకు తీసుకెళ్లి వ్యభిచారం చేయడం మొదలుపెట్టారు. 
 
ఈ ముఠా నుంచి ఒక కేజీ గంజాయి, 4300 కండోమ్స్ ప్యాకెట్లు, రూ.75 వేల నగదు, ఓ కారు, మైబైల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలక నిందితురాలు లత కాగా, ఆమె సభ్యులుగా అబ్దుల్ అఫ్నాన్, శైలాని బాబా, మొహ్మద్ అల్తాఫ్, మీర్జా ఫైజ్ బేగ్‌లు ఉన్నారు. వీరందరినీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ముఠా నుంచి పలువురు మైనర్ బాలికలను పోలీసులు రక్షించారు. కాగా, ఈ కేసులో అరెస్టు చేసిన మైనర్ బాలికలను పోలీసులు రక్షించారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దసరాకు సీజన్‌లో విడుదలయ్యే తెలుగు చిత్రాలేంటి?

Samantha: చైతూ టాటూను తొలగించుకునే పనిలో పడిన సమంత రూత్ ప్రభు

Vijay Sethupathi: పూరీ జగన్నాథ్ స్పీడ్ పెంచాడా? రెండు సినిమాలు చేస్తున్నాడా?

క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ తో ఓ అందాల రాక్షసి సిద్ధమైంది

Shah Rukh Khan: సుకుమార్ కు బాలీవుడ్ ఆపర్లు - షారుఖ్ ఖాన్ తో చర్చలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం